News April 9, 2025

తాండూర్: ఉచితంగా శిక్షణ

image

తాండూరు ప్రాంతంలోని అమ్మాయిలకు, మహిళలకు టైలరింగ్, మెహెందీ డిజైన్‌ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ నెల 15వ తేది నుంచి తాండూరు పట్టణం ముర్షద్ దర్గా సమీపంలోని కార్యాలయంలో అన్ని వర్గాల అమ్మాయిలు, మహిళలకు టైలరింగ్, మెహెందీ డిజైన్లలో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు.

Similar News

News February 22, 2026

టీమ్ఇండియా 5 వికెట్లు డౌన్

image

T20WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తొలుత ఓపెనర్ కిషాన్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ అభిషేక్ 15 పరుగులకే వెనుదిరిగారు. తిలక్ వర్మ(1), సుందర్(11) సైతం రాణించలేదు. ఆపై నిలకడగా ఆడుతున్న కెప్టెన్ సూర్య(18) 10వ ఓవర్లో ఔట్ అయ్యారు.

News February 22, 2026

ఆసిఫాబాద్: ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

image

ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన కెరమెరి మండలంలో చోటు చేసుకుంది. కెరమెరి ఎస్ఐ మధుకర్ కథనం ప్రకారం.. కెరిమెరికి చెందిన గుర్నాలే వార్లు(74) బస్టాండ్ సమీపంలోని కిరాణా షాపునకు వెళ్తున్న ఆయను, వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

News February 22, 2026

NTR: సూసైడ్ చేసుకున్న హిజ్రా..!

image

ఉరి వేసుకుని ఓ హిజ్రా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. జక్కంపూడికి చెందిన అబ్దుల్ రెహమాన్ 12 సంవత్సరాల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయి హిజ్రాగా మారాడు. అతను అంజలి అనే పేరు పెట్టుకొని జీవిస్తున్నాడు. కాగా ఆదివారం ఇంట్లో అనుమానస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.