News March 29, 2025
తాండూర్ ఎంపీడీవో గదిలో పాము కలకలం

వికారాబాద్ జిల్లా తాండూర్ మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీవో గదిలో గురువారం పాము ప్రత్యక్షమైంది. అటెండర్ రోజూలానే గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా పాము కనిపించింది. దీంతో సిబ్బందికి సమాచారం ఇవ్వగా చంపేశారు. కార్యాలయ పరిసరాల్లో పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు ఉండటంతో విష సర్పాలు సంచరిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. కార్యాలయాల్లో పరిసరాలను పరిశుభ్రం చేయాలని పలువురు కోరుతున్నారు.
Similar News
News September 16, 2025
జేపీ నడ్డాకు మోరి జీడిపప్పు దండతో సత్కారం

విశాఖపట్నంలో సోమవారం జరిగిన సారథ్యం సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన జీడిపప్పుతో తయారు చేసిన దండతో సత్కరించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్కుమార్, జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, ఇతర రాష్ట్ర నేతలు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమను సత్కరించిన అంబేడ్కర్ కోనసీమ నేతలను జేపీ నడ్డా అభినందించారు.
News September 16, 2025
డిజిటల్ అరెస్ట్ మోసాలకు జాగ్రత్త: వరంగల్ పోలీసుల హెచ్చరిక

వరంగల్ పోలీసులు ప్రజలకు ముఖ్య సూచనలు జారీ చేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఎవరైనా కాల్ చేసి బెదిరించిన అసలు భయపడవద్దని వారు స్పష్టం చేశారు. ‘డిజిటల్ అరెస్ట్ అనే విధానం అసలు లేనిది. పోలీస్ యూనిఫాంలో ఎవరైనా వీడియో కాల్ చేసి మనీలాండరింగ్, డ్రగ్స్ కేసు అంటూ బెదిరిస్తే భయపడి డబ్బులు ఇవ్వొద్దు’ అని సూచించారు. ఇలాంటి మోసపూరిత కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
News September 16, 2025
కూతురు మృతి.. హీరో ఎమోషనల్ కామెంట్స్

చనిపోయిన తన కూతురు మీరాను మిస్సవ్వడం లేదని, ఆమె ఇంకా తనతోనే ఉన్నట్లు భావిస్తున్నానని తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలిపారు. ‘నేను కూతుర్ని కోల్పోలేదు. ఆమె నాతోనే ప్రయాణిస్తోంది. ఆమెతో రోజూ మాట్లాడుతున్నా. ఇందులో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీరా రెండేళ్ల క్రితం ఇంట్లో సూసైడ్ చేసుకోగా, తానూ ఆమెతోనే చనిపోయానని ఆ సమయంలో విజయ్ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.