News April 3, 2025
తాండూర్: తాగొచ్చి.. భార్య, అత్తను కొట్టాడు: SI

తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య, అత్తను కొట్టిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. మార్చి 16న అచలాపూర్ గ్రామపంచాయతీ కొమ్ముగూడెంకు చెందిన దాగం మల్లేశ్ అనే వ్యక్తి మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడ్డారు. భార్య లావణ్య, అత్త రాజు అడ్డుపడగా.. వారిని కబ్గిరి గరిటతో తలపై బలంగా కొట్టి గాయపర్చాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
Similar News
News November 19, 2025
వయోవృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంది: కలెక్టర్

వయోవృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షామీర్పేటలోని రుద్రమదేవి ఓల్డ్ హోమ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వయోవృద్ధుల కోసం ప్రత్యేక సంక్షేమ చట్టం ఉందని, తల్లిదండ్రులను సరిగా చూసుకోని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.

HYD: 18 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

నవంబర్ 12 నుంచి 18వరకు జరిగిన ఆపరేషన్లో 11కేసులను ఛేదించి దేశ వ్యాప్తంగా 18మందిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ట్రేడింగ్ మోసాలను కట్టడి చేస్తూ 15మందిని పట్టుకున్నారు. హెటెరో కంపెనీపై 250 మిలియన్ డాలర్ల భారీ ఎక్స్టోర్షన్కు ప్రయత్నం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నకిలీ మెయిల్స్, ఫేక్ USFDA డాక్యూమెంట్లతో గ్యాంగ్ బెదిరించిందన్నారు.