News April 25, 2024

తాండూర్: పోలీస్ విధులకు ఆటంకం.. ఏడుగురి రిమాండ్

image

రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్న క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై జగదీష్ గౌడ్ తెలిపారు. ఈ నెల 20న పోలీసులు రేషన్ బియ్యం పట్టుకున్న సమయంలో ఏడుగురు వ్యక్తులు తాండూర్ పోలీసు స్టేషన్ కు వచ్చి దుర్భాషలాడడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. దీంతో వారిపై కేసు నమోదు కాగా మంగళవారం రిమాండ్ కు తరలించారు.

Similar News

News November 14, 2025

పోషకాహారం లక్ష్యంగా ముందుకు: కలెక్టర్ రాజర్షి షా

image

విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ మండలం మన్నూర్ పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయన న్యూట్రీ గార్డెన్, ఆర్‌వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, డీఆర్డీఓ రవీందర్, మండల ప్రత్యేక అధికారి తదితరులు పాల్గొన్నారు.

News November 14, 2025

ADB: ఈనెల 19న బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు

image

ఆదిలాబాద్ జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-17 జిల్లాస్థాయి బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు ఈనెల 19న నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్ తెలిపారు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, సర్టిఫికెట్​లతో రిపోర్ట్ చేయాలని కోరారు. పాల్గొనేవారు తప్పనిసరిగా సొంతంగా క్రికెట్ కిట్, యూనిఫాం తీసుకురావాలని సూచించారు.

News November 13, 2025

బోథ్: రెండు రోజులు సోయా, మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేత

image

AMC బోథ్ మార్కెట్‌లో సోయా, మొక్కజొన్న కొనుగోళ్లు రెండు రోజులు నిలిపివేస్తున్నట్లు సెంటర్ ఇన్‌ఛార్జ్ గోలి స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. బోథ్ మార్కెట్‌లో అధిక మొత్తంలో పంట నిల్వ ఉండడంతో నవంబర్ 14 నుంచి 16 వరకు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. తిరిగి నవంబర్ 17 నుంచి యధావిధిగా కొనుగోళ్లు చేపడతామని, రైతులు గమనించి సహకరించాలని కోరారు.