News March 13, 2025
తాండూర్: రూ.1.30లక్షల తాకట్టు నగదు చోరీ!

తాండూరు పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.1.30 లక్షల లోన్ తీసుకున్నారు. తదనంతరం మళ్లీ కారులో బయలుదేరారు. కొద్ది దూరంలో టైర్ పంచర్ కావడంతో శారద భర్త రాజు కారు టైర్ పంచర్ చేయించడానికి తీసుకెళ్లాడు. ఇదంతా గమనించిన ఓ దుండగుడు భార్య శారదకు మాయమాటలు చెప్పి కారులో నుంచి దించి డబ్బుల బ్యాగుతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితులు తాండూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 14, 2026
ఇరాన్‌తో మరోసారి అమెరికా చర్చలు?

కాల్పుల విరమణ గడువు ముగియక ముందే మరోసారి ఇరాన్‌తో చర్చించాలని అమెరికా భావిస్తోంది. ఎప్పుడు, ఎక్కడ భేటీ కావాలనేది ఇంకా నిర్ణయించలేదని CNN తెలిపింది. 2 దేశాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పినట్లు పేర్కొంది. మరోవైపు యురేనియం శుద్ధిని 20 ఏళ్లు నిలిపేయాలని తొలి దశ చర్చల్లో US ప్రతిపాదించిందని Axios తెలిపింది. చర్చలు విఫలం కావడానికి ఈ డిమాండే ముఖ్య కారణమని పేర్కొంది.
News April 14, 2026
పరమాత్ముడు ఒక్కడే.. ఈ సత్యాన్ని తెలుసుకోండి

కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు
యుప్పు లవణ మండ్రు యొకటి గాదె?
భాషలింతె వేఱు పరతత్వమొకటే
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: కొన్ని పదాలకు ఒకే అర్థంలో పర్యాయపదాలుంటాయి. కుండను కుంభం, ఉప్పును లవణం, కొండను పర్వతం అంటారు. అలాగే దేశంలో కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు ఎన్ని ఉన్నా ఆ పరమాత్ముడు ఒక్కడే. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవడం ముఖ్యం.
<<-se>>#PADHYAM<<>>
News April 14, 2026
మే తొలి వారంలో టెన్త్ ఫలితాలు!

TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిన్నటితో ముగిశాయి. మే తొలి వారంలో ఫలితాలు రిలీజ్ చేసేందుకు SSC బోర్డు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పరీక్షలు కొనసాగుతుండగానే సమాంతరంగా ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ నిర్వహించారు. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయినట్లు తెలుస్తోంది. సైన్స్, సోషల్ వాల్యుయేషన్, స్కానింగ్ ప్రక్రియ ఈ నెల 25 లోపు పూర్తి కానుందని సమాచారం.


