News January 26, 2025

తాంసిలో పులి సంచారం

image

ఇటీవల భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి రిజర్వాయర్ ప్రాంతంలో పులి కనిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే శనివారం రాత్రి తాంసి మండలంలోని వామన్ నగర్ గ్రామానికి వెళ్లే మార్గంలో పులి రోడ్డు దాటుతూ కనిపించినట్లు రైతులు స్వామి, అశోక్ తెలిపారు. వాహనాల లైట్ల వెలుతురుకి అది వెళ్లిపోయిందన్నారు.

Similar News

News November 3, 2025

మెదక్: రేపటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు

image

ఈ నెల 3 నుంచి 30 వరకు మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు.

News November 3, 2025

చిరకాల విజయం తర్వాత కాబోయే భర్తతో స్మృతి

image

ప్రపంచకప్ విజయం తర్వాత భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన కాబోయే భర్త, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో కలిసి కప్పును పట్టుకున్న ఫొటో వైరల్ అవుతోంది. ఈనెలలోనే వీరిద్దరూ <<18043744>>పెళ్లి<<>> చేసుకోనున్నారు. కెరీర్‌లో అత్యున్నత విజయాన్ని సాధించిన ఈ సంతోష క్షణాన్ని ప్రియమైన వ్యక్తితో పంచుకోవడం అద్భుతంగా ఉందని అభిమానులు కొనియాడుతున్నారు.

News November 3, 2025

ఊట్కూర్: మాదాసి కురువలకు ఎస్సీ కుల ధ్రువీకరణ ఇవ్వొద్దని ఫిర్యాదు

image

ఉట్కూర్ అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో మదాసీ కుర్వలకు ఎస్సీ కుల ద్రువీకరణ పత్రాలు ఇవ్వొద్దని అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కులం ఇంతకు ముందు బీసీ వర్గానికి చెందినదని, తెలంగాణలో మదాసీ కుర్వ అనే వర్గం లేదని వివరించారు. దీనిపై అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించి, ఫిర్యాదును పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం సభ్యులు శంకర్,కార్యదర్శి కొండన్ భరత్ పాల్గొన్నారు.