News April 5, 2025
తాంసి: విద్యుదాఘాతంతో రైతు మృతి

తాంసి మండలం పొన్నారికి చెందిన అశిలీ పోచన్న అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోచన్న ఆదిలాబాద్ రైతు బజారులో కూరగాయాలు విక్రయిస్తుంటాడు. శుక్రవారం బల్బు వెలుగకపోవడంతో దాన్ని సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో కౌలు రైతు కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Similar News
News April 7, 2025
బెట్టింగ్.. నలుగురి అరెస్ట్: ADB SP

ADBలో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న రియాజ్, పిట్టలవాడకు గంథాడే సోహన్ IPL బెట్టింగ్ నిర్వహిస్తుండగా వారిని పట్టుకొని కేసు నమోదు చేశారు. వన్ టౌన్ పరిధిలో సుల్తాన్, ఒక మైనర్ సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ పాల్పడగా వారిపై కేసు నమోదు చేశారు. నగదు స్వాధీనం చేసుకున్నారు.
News April 7, 2025
ADB: మహిళల బంగారు పుస్తెల తాళ్లు చోరీ: CI

పండుగ సందర్భంగా గుడికి వెళ్లిన మహిళల మెడల్లో నుంచి పుస్తెల తాళ్లు చోరీ అయిన ఘటన ADBలో చోటుచేసుకుంది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాల మేరకు.. తిర్పల్లికు చెందిన ఠాకూర్ పద్మజ, మావలకు చెందిన సుమ బ్రాహ్మణ సమాజ్ రామమందిర్‌లో పూజకు వెళ్లారు. క్యూలైన్లో నిలబడి భోజనాలు చేశారు. అనంతరం చూసుకుంటే పద్మజ, సుమ మెడలోని బంగారు పుస్తెల తాళ్లు కనబడలేదు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News April 7, 2025
ADB: వారంలో 8 సైబర్ మోసాలు: SP

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ ఫ్రాడ్, మొబైల్ హ్యాకింగ్ లాంటి సైబర్ నేరాలకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గత వారంలో జిల్లాలో 8 సైబర్ ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ఎటువంటి గుర్తు తెలియని స్కాం నంబర్లు, లింక్లు ఓపెన్ చేయొద్దన్నారు. సైబర్ క్రైమ్‌కు గురైతే 1930కు కాల్ చేయాలని పేర్కొన్నారు.