News January 24, 2025

తాగి వాహనం నడిపితే లైసెన్సు రద్దు: DTO మానస

image

లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా రవాణా శాఖ అధికారిణి మానస హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించిన డ్రైవింగ్ లైసెన్సు మేళాకు విశేష స్పందన లభించిందని అన్నారు. లైసెన్స్ మేళాలో పరీక్షలు నిర్వహించి 35 మందికి లెర్నింగ్ లైసెన్సులు అందజేశారు. మద్యం తాగి వాహనం నడిపితే లైసెన్సు రద్దు చేస్తామన్నారు.

Similar News

News December 17, 2025

శ్రీరాంపూర్: రేపు సింగరేణి రిటైర్డ్ కార్మికులకు లాభాల వాటా చెల్లింపు

image

సింగరేణి సంస్థలో 2024-25లో రిటైరైన కార్మికులకు 35 శాతం లాభాల వాటాను గురువారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ తెలిపారు. అలాగే దీపావళి బోనస్(పీఎల్ఆర్) ఈనెల 23న చెల్లించనున్నట్లు వారు పేర్కొన్నారు. తమ సంఘం ఒత్తిడి మేరకు యాజమాన్యం అంగీకరించిందని.. ఈ విషయాన్ని విశ్రాంత కార్మికులు గమనించాలని వారు కోరారు.

News December 17, 2025

వెల్గటూర్: డ్రా పద్ధతి ద్వారా వరించిన సర్పంచ్ పదవి

image

వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల గ్రామంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. గ్రామంలో సర్పంచ్ పదవికి నలుగురు అభ్యర్థులు బరిలో నిలువగా, ఇద్దరు అభ్యర్థులకు 155 ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికారులు డ్రా పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించగా.. కోటయ్య అనే వ్యక్తి సర్పంచ్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కోటయ్యను అదృష్టం వరించింది.

News December 17, 2025

విశాఖ: ఎస్ఐల బదిలీల్లో మార్పులు

image

నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన 102 మంది ఎస్ఐల బదిలీల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. బుధవారం 18 మంది ఎస్ఐల విన్నపం మేరకు వారిని ఇతర స్టేషన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ అయిన ఎస్ఐలందరూ వెంటనే తమకు కేటాయించిన కొత్త స్టేషన్లలో బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పారదర్శకత, పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.