News May 20, 2024
తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడండి: నెల్లూరు కలెక్టర్

వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని కలెక్టర్ హరి నారాయణన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నీటి వసతిపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవిలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.
Similar News
News October 27, 2025
రేపు జూనియర్ కళాశాలలకు సెలవు: నెల్లూరు RIO

నెల్లూరు జిల్లాలో మంగళవారం అన్ని జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించినట్లు RIO వరప్రసాద్ రావు తెలిపారు. ‘మెంథా తుఫాన్’ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. కాగా ఇప్పటికే స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 27, 2025
లోతట్టు ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ

మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా 15 మొబైల్ వాహనాల ద్వారా కూరగాయలను విక్రయించే ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. జిల్లా మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఈ మొబైల్ వాహనాలను పంపి ప్రజలకు నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
News October 27, 2025
కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలి: JAC

కందుకూరు జేఏసీ నేతలు సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. కందుకూరు ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని వారు కోరారు. ఇందుకు నెల్లూరు నేతల అడ్డగింత సరికాదని విమర్శించారు. ప్రజల సెంటిమెంట్‌కు అనుగుణంగా ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.


