News February 21, 2025
తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

నీటి విడుదలలో తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. కలెక్టరేట్లో ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యానవన, నీటి సరఫరా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రధాన రెండు రిజర్వాయర్లు నీటి కొరత ఉన్నందున సాగునీటి విడుదలకు వారబందీ ప్రక్రియలో నీటిని విడుదల చేయాలన్నారు. అన్ని చెరువులలో పూర్తిస్థాయి నీటి సామర్థ్యం మేరకు మీరు నిల్వ చేయాలని తెలిపారు.
Similar News
News November 13, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 13, 2025
అల్ ఇండియా అథ్లెటిక్స్ పోటీలకు రంపచోడవరం విద్యార్థి

రంపచోడవరం డిగ్రీ కళాశాల విద్యార్థులు నన్నయ యూనివర్శిటీ నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు గెలుపొందినట్లు ప్రిన్సిపల్ డాకే వసుధ తెలిపారు. బెంగళూరులో నిర్వహించే అల్ ఇండియా అథ్లెటిక్స్ పోటీలకు జి. ప్రవీణ్ సెలెక్టైనట్లు వివరించారు. పతకాలు సాధించిన విద్యార్థులకు వైస్ ప్రిన్సిపల్ రవికుమార్, పీడీ ప్రభాకర్ రావు, అధ్యాపకులు అభినందించారు.
News November 13, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 13, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


