News March 5, 2025

తాగునీటిపై ఒక్క ఫిర్యాదు కూడా రాకూడ‌దు: కలెక్టర్  

image

జిల్లాలో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో తాగునీటికి సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. ఈనెల 15 నాటికి 100 శాతం తాగునీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాలూ క్రియాశీలం కావాల‌ని అన్నారు. ఈ మేరకు మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ నుంచి ఎంపీడీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, వివిధ అధికారుల‌తో ఆయన టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. 

Similar News

News December 9, 2025

HYD: పడిపోలేదు.. జస్ట్ ఒరిగిందంతే!

image

చూడటానికి యాడ్ బోర్డుపై స్తంభం రెస్ట్ తీసుకుంటున్నట్లు ఉన్న ఈ విజ్యువల్ పెద్దఅంబర్‌పేట్ NH-65పైది. జులైలో భారీ ఈదరుగాలులు, వర్షం ధాటికి ఈ లైన్ ఏబీ స్విఛ్ స్తంభం కిందపడేది. కానీ బోర్డు పక్కనే ఉండటంతో దానిపై వాలింది. 5నెలలు గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. హైవేపైన ఉన్నదానికే స్పందనలేకపోతే ఇక గల్లీల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

News December 9, 2025

BREAKING: తూ.గో జిల్లాలో స్కూల్ పిల్లల బస్సు బోల్తా

image

తూ.గో జిల్లాలో తెల్లవారుజామున పెనుప్రమాదం తప్పింది. పెరవలిలోని తీపర్రు వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉండగా వారు సురక్షితంగా బయటపడ్డారు. బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడం వలనే ప్రమాదం జరిగినట్లు సమాచారం.

News December 9, 2025

వనపర్తి: గెలుపు కోసం సర్పంచ్ అభ్యర్థుల నానాతంటాలు

image

జిల్లాలో ఈ నెల 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు మటన్, మద్యం పంపిణీకి భారీగా ఖర్చు చేస్తున్నారు. హోటళ్ల వద్ద టీ, టిఫిన్లకు కూడా భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు, నాయకులు శ్రమిస్తున్నారు.