News March 5, 2025
తాగునీటిపై ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదు: కలెక్టర్

జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఈనెల 15 నాటికి 100 శాతం తాగునీటి సరఫరా పథకాలూ క్రియాశీలం కావాలని అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, వివిధ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News March 22, 2025
తొర్రూర్‌లో బాలికకు అబార్షన్!

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మైనర్ బాలికకు గర్భస్రావం చేసిన ఘటన తొర్రూరులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాలు.. దంతాలపల్లి మం.కి చెందిన ఓ బాలిక గర్భం దాల్చడంతో ఆస్పత్రికి తీసుకురాగా అబార్షన్ చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితుడిపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
News March 22, 2025
ఎమ్మెల్సీ దువ్వాడకు డాక్టరేట్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడకు “DAYSPRING INTERNATIONAL UNIVERSITY” డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఈ మేరకు తాజాగా శుక్రవారం హైదరాబాద్ యూనివర్సిటీలో తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా శ్రీనివాస్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఆయనను పలువురు అభినందించారు.
News March 22, 2025
రాష్ట్రంలో కొత్తగా 70 బార్ల ఏర్పాటు!

TG: ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది. కొత్తగా 70 బార్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఇన్‌కమ్ ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 1,171 బార్లు ఉండగా వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్నాయి. మైక్రోబూవరీల సంఖ్యను పెంచే అవకాశమున్నట్లు సమాచారం.