News April 16, 2025

తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు: కలెక్టర్ 

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాగు నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచి నీరు విడుదల చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లా వాసులకు తాగు నీటికి ఇబ్బంది రాకుండా ఉండేందుకు నిరంతర పర్యవేక్షణతో మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు.

Similar News

News November 15, 2025

తన గమ్యమేంటో జడేజాకు తెలుసు: రవిశాస్త్రి

image

తన ఫ్యూచర్‌(IPL)పై బయట జరుగుతున్న చర్చతో ఆల్‌రౌండర్ జడేజా ఫోకస్ దెబ్బతిందన్న వ్యాఖ్యలపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘అతని తర్వాతి డెస్టినేషన్, సంపాదన ఎంత అనే అంశాలపై అంతా ఆసక్తిగా ఉంటారు. జడేజా ఎంతో అనుభవజ్ఞుడు. టాప్ క్లాస్ క్రికెటర్. తన గమ్యం, క్రికెట్‌పై చాలా ఫోకస్డ్‌గా ఉంటాడు. బయట విషయాలు క్రికెట్‌పై అతనికున్న ఫోకస్‌ను దెబ్బతీయలేవు’ అని SAతో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అన్నారు.

News November 15, 2025

HYDలో పెరుగుతున్న వాయు కాలుష్యం..!

image

HYDలో వాయుకాలుష్యం, గాలిలో ధూళి కణాల సాంద్రత వృద్ధి చెందుతోంది. పర్టిక్యులేట్ మ్యాటర్ 242ను సూచిస్తుంది. మంచు, చల్లని గాలిలో ధూళికణాలు 4 నుంచి 8 అడుగుల ఎత్తులో అధిక మోతాదులో ఉంటాయని, దీంతో శ్వాసకోశ రోగాలు ప్రబలే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలో మొత్తం 14 ప్రాంతాల్లో గాలినాణ్యతను కొలిచే యంత్రాలను PCB ఏర్పాటు చేసింది. కాగా, గాలినాణ్యత సూచి 100దాటితే ప్రమాదం ఉంటుందని PCB చెబుతోంది.

News November 15, 2025

సతీశ్ మృతి.. తండ్రిని కోల్పోయిన చిన్నారులు

image

పరకామణి కేసులో కీలకంగా వ్యవహరించిన <<18292672>>సతీశ్ హత్య<<>> రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇప్పటికే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టగా అటు పార్టీలు సైతం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. అయితే దేవుడి సొమ్ము చోరీని బయటపెట్టిన తన భర్త ఆదేవుడి దగ్గరికే వెళ్లిపోయాడంటూ ఆకుటుంబం ఆవేదన వ్యక్తంచేసింది. సతీశ్‌కు భార్య మమత, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సతీశ్ మృతితో ఒక్కసారిగా ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.