News April 25, 2024
తాగునీటి ఎద్దడిపై దృష్టి సారించాలి: అన్నమయ్య కలెక్టర్

జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ కెఎస్.జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 8, 2026
జమ్మలమడుగు: కన్యతీర్థం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?

జమ్మలమడుగు మండలంలోని పెద్దండ్లూరు వద్ద పెన్నా నదీ తీరాన భాను కొండల మధ్య సుమారు 5 వేల ఏళ్లకు పూర్వం ఈ క్షేత్రం వెలిసినట్లు ఆలయంలోని శాసనాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలోని పుష్కరిణిలో అలనాడు దేవకన్యకలు నిత్యం స్నానమాచరించి అమ్మవారిని సేవించుకోవడం వల్ల ఈ క్షేత్రానికి శ్రీకన్యతీర్థం అని పేరు వచ్చినట్లు పూజారులు చెబుతున్నారు. కన్యతీర్థం, తిరుపతి, శ్రీశైలం ఆలయంలో ఒకే ఆచారం, పోలికలు ఉండటం మరో విశేషం.
News February 8, 2026
ప్రొద్దుటూరులో ACP సస్పెండ్‌తో నైనా.. అధికారుల అవినీతి తగ్గేనా?

ప్రొద్దుటూరు ACP నాగరాజు సస్పెండ్‌తో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తి అవినీతి మయంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇళ్లు, షాపులు, అపార్ట్మెంట్లు, కాంప్లెక్సులు ప్రతి నిర్మాణానికి అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారట. మామూళ్ల వసూలు కోసం ఏజెంట్లను సైతం పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. కింది స్థాయి సిబ్బంది మొదలుకొని, TPO, ACP వరకు అందరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News February 8, 2026
గాండ్ల సంక్షేమ కార్పొరేషన్ కోసం CMకు వినతి

గాండ్ల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును శనివారం విజయవాడలో కలిసి విన్నవించినట్లు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య తెలిపారు. గాండ్ల సంఘం అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ కావాలని, నూనె తయారీ యూనిట్లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని విన్నవించినట్లు తెలిపారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.


