News April 13, 2024

తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు: కలెక్టర్

image

వేసవిలో ప్రజలకు నీటి కొరత లేకుండా సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మందిరంలో సంబంధిత సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మంచినీటి పథకాలు పని చేయలేదనే ఫిర్యాదు ఒక్కటీ ఉండకూడదన్నారు. నీటి నాణ్యతను గురించి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. 

Similar News

News September 30, 2024

జాతీయస్థాయి హాకీ శిక్షకుడిగా సిక్కోలు వాసి

image

జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర మహిళల జట్టు కోచ్‌గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అల్లు అనిల్ కుమార్‌ను నియమించినట్లు ఏపీ హాకీ సంఘ అధ్యక్షుడు బి.ఎం. చాణక్యరాజు ఆదివారం తెలిపారు. రాష్ట్రానికి హకీ క్రీడలో మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కిందని జిల్లా హాకీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అప్పలనాయుడు, రమేశ్ అభినందించారు.

News September 30, 2024

అరసవెల్లి ఆలయంలో సూర్యకిరణ దర్శనం

image

అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా తొలి సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్టును తాకనున్నాయి. ఆ అరుదైన క్షణాలు అక్టోబర్ 1, 2 తేదీల్లో సాక్షాత్కరించనున్నాయని EO భద్రాజీ ఆదివారం తెలిపారు. సూర్యోదయ సమయంలో నేరుగా సూర్యకిరణాలు గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్టును తాకడం ఇక్కడి క్షేత్ర మహత్యంగా చెబుతుంటారు. భక్తులు దర్శించుకోవాలని కోరారు.

News September 30, 2024

సారవకోట: అత్యాచార కేసులో నిందితుడి అరెస్ట్

image

సారవకోట మండలంలో ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి బాలికపై అత్యాచారం చేసిన కేసులో అదే ప్రాంతానికి చెందిన బుద్దల హేమసుందరరావును శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజశేఖర్ విచారణ చేశారన్నారు. యువకుడి అరెస్ట్ అనంతరం పాతపట్నం కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.