News February 7, 2025
తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: MNCL కలెక్టర్

వేసవి కాలం సమీపిస్తున్నందున మంచిర్యాల జిల్లాలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో నిరంతరంగా నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో తాగునీటి సరఫరా నిర్వహణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ పథకంలోని మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల్లో అవసరమైన మేరకు నీటిని అందించాలని సూచించారు.
Similar News
News September 16, 2025
శుభ సమయం (16-09-2025) మంగళవారం

✒ తిథి: బహుళ దశమి రా.2.51 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర ఉ.10.33 వరకు
✒ శుభ సమయములు: సా.5.10-సా.6.10
✒ రాహుకాలం: మ.3.00-మ.4.30
✒ యమగండం: ఉ.9.30-మ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: రా.10.08-రా.11.38
✒ అమృత ఘడియలు: ఏమీ లేవు
News September 16, 2025
స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ను సక్సెస్ చేయాలి: కలెక్టర్ తేజస్

‘స్వస్త్ నారి, సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతాయని పేర్కొన్నారు.
News September 16, 2025
మెదక్: రేవంత్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్: హరీశ్రావు

కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్ అయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఆపేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని ఆయన విమర్శించారు. డ్రామాలు కట్టిపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.