News April 3, 2025
తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

వేసవికాలంలో బాపట్ల జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు. గురువారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఆయన వీక్షణ సమావేశంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సమస్యలపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో ప్రజల అనారోగ్యానికి గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. జేసీ ప్రకార్ జైన్ పాల్గొన్నారు.
Similar News
News April 8, 2025
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్లో భాగంగా సీఎస్కేతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
CSK: రుతురాజ్(C), కాన్వే, రచిన్, విజయ్, జడేజా, ధోని, అశ్విన్, నూర్, ముకేశ్, ఖలీల్, పతిరణ.
PBKS: ఆర్య, ప్రభ్సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్(C), స్టొయినిస్, వధేరా, మ్యాక్స్వెల్, శశాంక్, జాన్సెన్, అర్ష్దీప్, ఫెర్గూసన్, చాహల్.
News April 8, 2025
బాపట్ల: ప్రభుత్వ లక్ష్యాలకు సిబ్బంది కృషిచేయాలి- కలెక్టర్

ప్రగతిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 వేల కుటుంబాలకు పాడి పశువులను అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించారని కలెక్టర్ పేర్కొన్నారు.
News April 8, 2025
ఏసీబీ వలలో చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి

చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి ఏసీబీ వలలో చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఎస్సై ఏసీబీకి చిక్కడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎస్సై అంతిరెడ్డి నార్కెట్పల్లిలో పనిచేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.