News February 25, 2026

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

image

గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని పల్నాడు కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు.
జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన పైపులైన్లు, రహదారుల నిర్మాణాలకు అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మౌలిక వసతులపై సమీక్షించారు. 6 మండలాలకు చెందిన 22 తండాల్లో తాగునీటి పైపులైన్ పనులకు అనుమతులు మంజూరు చేయాలన్నారు.

Similar News

News April 15, 2026

ముగింపు దశలో యుద్ధం.. కానీ: ట్రంప్

image

ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌తో యుద్ధం ముగింపు దశకు చాలా దగ్గరగా ఉందన్నారు. అయితే అమెరికా పని ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. ‘వారు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడే మా బలగాలను ఉపసంహరించుకుంటే ఆ దేశాన్ని తిరిగి నిర్మించుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు.

News April 15, 2026

ప.గో: ప్రేమ విఫలమై యువకుడు సూసైడ్!

image

భీమవరం కొత్త బస్టాండ్ వద్ద కృష్ణా జిల్లా బంటుమిల్లి(M) మల్లిపూడికి చెందిన రాజేశ్(23) ఈనెల 3వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా ఈనెల 13న మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ విఫలం కావడమే ఆత్మహత్యకు కారణమని తెలిపారు.

News April 15, 2026

నిజామాబాద్: అంగన్‌వాడీ.. డిజిటల్ వే

image

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్‌ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 3,250 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటికి కొత్త ఫోన్లను అందజేస్తున్నారు. పాత ఫోన్ల సాంకేతిక ఇబ్బందుల వల్ల డేటా నమోదులో జాప్యం జరుగుతోందని గుర్తించిన యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ టీచర్లు కొత్త ఫోన్ల రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.