News March 24, 2025
తాగునీటి సమస్య పై టోల్ ఫ్రీ : జిల్లా కలెక్టర్

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తాగునీటి మానిటరింగ్ సెల్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. తాగు నీటి సమస్యల కోసం 9908712421 నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పని చేస్తుందని పేర్కొన్నారు. ఫిర్యాదులను సంబంధిత పంచాయతీ, మిషన్ భగీరథ అధికారులకు తెలుపాలన్నారు.
Similar News
News April 1, 2025
IPL: నేడు లక్నోతో పంజాబ్ కింగ్స్ ఢీ

IPLలో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నోలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆడిన తొలి మ్యాచులోనే పంజాబ్ ఘన విజయం సాధించి జోరు మీద ఉంది. ఈ మ్యాచులో కూడా గెలిచి 2 పాయింట్లు తమ ఖాతాలో వేసుకోవాలని శ్రేయస్ అయ్యర్ సేన భావిస్తోంది. మరోవైపు లక్నో తొలి మ్యాచులో ఓటమిపాలైనా, రెండో మ్యాచులో SRHపై గెలిచింది. ఇదే జోరులో పంజాబ్‌ను ఓడించాలని యోచిస్తోంది.
News April 1, 2025
గద్వాల: ‘ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి’

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గద్వాల జిల్లా నుంచి కలెక్టర్ సంతోష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News April 1, 2025
అమరచింత: రాత్రి వేళైనా కొనసాగుతున్న మున్సిపల్ వసూళ్లు

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ కేంద్రంలో సోమవారం రాత్రి 8 గంటలైనా మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ పన్నును వసూలు చేస్తున్నారు. దీనిపై పలువురు లబ్ధిదారులు పండుగ పూట, రాత్రయినా వసూలు చేస్తున్నారని వాపోయారు. అయినా ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని తెలపడంతో తప్పని పరిస్థితిలో చెల్లిస్తున్నట్లు లబ్ధిదారులు పేర్కొన్నారు.