News March 3, 2025
తాగునీటి సమస్య రాకుండా చర్యలు: కలెక్టర్

కోనసీమ జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురంలో తాగునీటి సరఫరా ఇంజినీర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. తాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులు చేపట్టి వాటిని పూర్తి చేయాలన్నారు. నదీతీరంలోని తాగునీటి ఏర్పాట్లు, బోరు బావుల మరమ్మతులు, వేసవి స్టోరేజ్ ట్యాంకులు నింపడం, వేసవి కార్యాచరణపై సమీక్షించారు.
Similar News
News November 19, 2025
నేటి సామెత.. ‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.

మానవ రూపంలో గణేషుడ్ని చూశారా?

మనందరికీ ఏనుగు తలతో కూడిన గణపతి మాత్రమే తెలుసు. కానీ ఆయన మానవ రూపంలో ఎలా ఉంటారో చాలామందికి తెలీదు. అయితే వినాయకుడు నరుడిగా దర్శనమిచ్చే ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆది వినాయకుడిగా పూజలందుకునే స్వామివారికి త్రేతా యుగంలో రాములవారు పూజలు నిర్వహించినట్లు స్థల పురాణం చెబుతోంది. అప్పుడు రాముడు సమర్పించిన పిండాలు 4 శివలింగాలుగా మారాయట. వాటినీ ఈ ఆలయంలో చూడవచ్చు. <<-se>>#Temple<<>>