News February 12, 2025
తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా, డివిజన్ అధికారులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్యలను ముందస్తు ప్రణాళికలతో గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని అన్నారు.
Similar News
News December 7, 2025
కృష్ణా: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు..!

తండ్రికి కూతురు తలకొరివి ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టించింది. పెడన మండలం పెనుమల్లి గ్రామంలో ఏడుకొండలు (56) అనారోగ్యంతో మరణించారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో, మూడవ కుమార్తె కళ్యాణి తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది. కుటుంబ పెద్దల సమక్షంలో ఆమె తన తండ్రికి తలకొరివి పెట్టన దృశ్యం గ్రామస్థుల హృదయాలను కలచివేసింది.
News December 7, 2025
పాడేరు: ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష

జిల్లా వ్యాప్తంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, వీఆర్ పురం, చింతూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని డీఈవో పీ.బ్రహ్మాజీరావు తెలిపారు. పరీక్ష కోసం మొత్తం 727 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 678 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్ష నిర్వహించామన్నారు.
News December 7, 2025
రౌడీషీటర్లకు ఎస్పీ హెచ్చరిక

తూర్పుగోదావరి ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలతో ఆదివారం జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్హెచ్ఓల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేరస్తుల ప్రవర్తనపై ఆరా తీశారు. అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని, మళ్లీ చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాల్లో భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


