News February 12, 2025

తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా, డివిజన్ అధికారులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్యలను ముందస్తు ప్రణాళికలతో గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని అన్నారు.

Similar News

News March 23, 2025

విశాఖలో సందడి చేసిన చిత్రబృందం

image

విశాఖలో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” చిత్రబృందం సందడి చేశారు. ఆదివారం విశాఖలో ఒక హోటల్లో మీడియా సమావేశంలో హీరో ప్రదీప్ మాట్లాడారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఇది సిద్ధమవుతోందన్నారు. వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయని వివరించారు. హీరోయిన్ దీపికా ఉన్నారు.

News March 23, 2025

అరసవల్లి ఆదిత్యుని నేటి ఆదాయం

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.3,76,300/- లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,41,803/-లు, ప్రసాదాలకు రూ.1,73,720/-లు,శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. 

News March 23, 2025

బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్

image

TG: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని ఏం అడిగినా శివం, శవం అంటూ ముచ్చట చెబుతున్నారని దుయ్యబట్టారు. బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు.

error: Content is protected !!