News March 8, 2025

తాగు నీటి కోసం ప‌డుతున్న క‌ష్టం ఇదీ: హ‌రీశ్‌రావు

image

మండుటెండ‌లు రాక‌ముందే.. తెలంగాణ వ్యాప్తంగా తాగునీటి క‌ష్టాలు మొద‌ల‌ైనట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు స్పందించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం పడుతున్న కష్టం ఇది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను సీఎం రేవంత్ రెడ్డి వల్ల మళ్లీ చూస్తున్నామ‌ని మండిప‌డ్డారు.

Similar News

News April 21, 2025

BREAKING: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేట్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. కారులో చిన్నారులతో సహా 9 మంది ఉండగా ఏడాది బాబు గౌస్, ఆలీ (45), అజీం బేగం(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2025

రామాయంపేట: బట్టల వ్యాపారి మిస్సింగ్.. కేసు నమోదు

image

బట్టల వ్యాపారం చేయడానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. UPకి చెందిన బాబుల్ సింగ్(23 కొంతకాలంగా రామాయంపేటలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 18న బోడ్మట్‌పల్లిలో బట్టల వ్యాపారం కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతని బావ గజేందర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 21, 2025

మెదక్: BRS నేతలపై కేసు నమోదు

image

బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల గోడలపై పార్టీ చిత్రలేఖనం గీసిన బీఆర్ఎస్ నాయకులపై హావేళి ఘణపురం మండల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మెదక్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, నేతలు ఆర్.కె.శ్రీను, జుబేర్, ఫాజిల్‌లపై కేసు నమోదు చేశారు.

error: Content is protected !!