News July 19, 2024
తాగు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేయండి: ఎమ్మెల్సీ

అమరావతి సచివాలయంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్సీ బీటీ నాయుడు కలిశారు. కర్నూలు జిల్లాలోని తాగునీరు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేయాలని కోరినట్లు బీటీ నాయుడు తెలిపారు. అనంతరం రాష్ట్రం గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.
Similar News
News November 25, 2025
కర్నూలు SP స్పందనకు 95 ఫిర్యాదులు

కర్నూలులో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 95 ఫిర్యాదులు స్వీకరించినట్టు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజలను ప్రత్యక్షంగా కలసి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ, పోలీసు అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News November 24, 2025
లింగ సమానత్వానికి కృషి చేయాలి: కర్నూలు కలెక్టర్

సమాజంలో లింగ సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “జెండర్ సమానత్వం” జాతీయ ప్రచార పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా “నయీ చేతన 4.0 –మార్పు కోసం ముందడుగు” పేరుతో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు.