News March 24, 2025

తాజంగి: అంగన్వాడీ గ్రేడ్-1 సూపర్వైజర్ మృతి

image

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం తాజంగి పంచాయతీలో గల వంతమామిడి గ్రామానికి చెందిన సి హెచ్ సత్యవతి అంగన్వాడీ సూపర్ వైజర్‌గా పని చేస్తున్నారు. పోషణ్ భీ పడాయి భీ శిక్షణలో భాగంగా శనివారం శిక్షణ ఇస్తూ ఒక్కసారిగా స్పృహా తప్పడంతో తోటి ఉద్యోగులు హుటాహుటిన చింతపల్లి సీహెచ్చికి తరలించారు. ఆరోగ్యం విషమంగా ఉండటంతో నర్సీపట్నం హాస్పిటల్ నుంచి విశాఖ కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.

Similar News

News October 20, 2025

ప్రపంచం మొత్తానికి మీరు బాసా?.. ట్రంప్‌పై ఖమేనీ ఫైర్

image

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. ‘మీరు మా న్యూక్లియర్ సైట్లను ధ్వంసం చేశామని చెబుతున్నారు. మీ ఊహల్లో మీరు ఉండండి’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీరు మా సైంటిస్టులను చంపేశారు. కానీ వారి నాలెడ్జ్‌ను కాదు. ఒక దేశానికి న్యూక్లియర్ ఇండస్ట్రీ ఉంటే మీకు ఎందుకు? జోక్యం చేసుకోవడానికి మీరు ఎవరు? ప్రపంచం మొత్తానికి మిమ్మల్ని ఎన్నుకున్నారా?’ అని ప్రశ్నించారు.

News October 20, 2025

విశాఖ: గమనిక.. LTT ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు ఆలస్యం

image

విశాఖపట్నం నుంచి ముంబై వెళ్లే LTT లోకమాన్య తిలక్ టెర్మినస్ (18519) ఎక్స్‌ప్రెస్ సోమవారం రీ షెడ్యూలు అయింది. విశాఖలో సోమవారం(అక్టోబర్ 20) రాత్రి 11.20 గంటలకు బయలదేరాల్సిన ఈ రైలు.. మంగళవారం అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరేలా మార్పు చేసినట్లు విశాఖలోనీ రైల్వే అధికారులు తెలిపారు. లింక్ రేక్ ఆలస్యం కారణంగా రీషెడ్యూల్ జరిగినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఇది గమనించి సహకరించాలని కోరారు.

News October 20, 2025

ప్రభుత్వం డీఏ జీఓను సవరించాలి: విజయ్

image

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కరవు భత్యాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ జారీచేసిన 60, 61 జీఓలు అసంబద్ధంగా ఉంటూ ఉద్యోగికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని, వెంటనే జీవోలను సవరించాలని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. డీఏ అరియర్స్ పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామని అనడం సరైనది కాదన్నారు.