News March 5, 2025

తాటిచెట్లపాలెంలో ఇద్దరు మృతి

image

విశాఖలోని తాటిచెట్లపాలెం వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంచరపాలెం స్టేషన్ పరిధిలోని బైక్‌పై అతివేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 26, 2025

విశాఖలో టమోటా రేటు ఎంతంటే?

image

విశాఖ 13 రైతు బజార్లో వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు బుధవారం కూరగాయల ధరలను విడుదల చేశారు.(రూ/కేజీలలో) వాటి వివరాలు టమోటా రూ.16, ఉల్లి రూ. 23, బంగాళాదుంపలు రూ.16, తెల్ల వంకాయలు రూ.28, బెండ రూ.28, కాకర రూ.32, బీర రూ.38, క్యారెట్ రూ. 28/32, బీట్రూట్ రూ.24, బరబాటి రూ.25, గ్రీన్ పీస్ రూ.52, క్యాప్సికం రూ.38, పొటాల్స్ రూ. 48, బీన్స్ రూ.48, క్యాబేజీ రూ.10, కాలీఫ్లవర్ రూ.20, నిర్ణయించారు.

News March 26, 2025

విశాఖ సీపీ సూచన.. సీఎం చంద్రబాబు ఆదేశాలు..!

image

రాష్ట్రంలో డీ అడిక్షన్ సెంటర్లు పెంచాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశంలో సూచించారు. ఒక్కో డ్రగ్‌కు ఒక్కో విధమైన ట్రీట్‌మెంట్ ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలని ఆదేశించారు. ఏ ప్రాంతంలో ఏ డ్రగ్ ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకుంటే అక్కడ డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేయొచ్చని అధికారులకు సూచించారు.

News March 26, 2025

విశాఖ ఉక్కులో మోగనున్న సమ్మె సైరన్

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ నెల 28న ఒక్క రోజు సమ్మెకి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలు పిలుపునిచ్చాయి. సంబంధిత కరపత్రాలను గేటు వద్ద మంగళవారం పంపిణీ చేశారు. కార్మికుల తొలగింపునకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఉక్కు యాజమాన్యం కార్మికులకు మెడికల్ టెస్టుల పేరుతో తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఈ సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు.

error: Content is protected !!