News July 15, 2024
తాటిపూడి జలాశయంలో మృతదేహం కలకలం

గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం ఆదివారం సాయంత్రం లభ్యమైందని గంట్యాడ ఎస్.ఐ సురేంద్ర నాయుడు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 45 – 50 మధ్య ఉంటుందన్నారు. మూడు రోజుల క్రితమే ఈ సంఘటన జరిగి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. స్థానిక VRO సమాచారంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించామన్నారు. ఆచూకీ తెలిసినవారు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News November 30, 2025
VZM: ‘గురజాడ నివాసాన్ని జాతీయ స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలి’

గురజాడ అప్పారావు నివాసాన్ని జాతీయ స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రముఖ కవి తెలకపల్లి రవి, సామాజిక వేత్త దేవి డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరంలో గురజాడ వర్ధంతి సందర్భంగా జరిగిన గౌరవ యాత్రలో వారు పాల్గొన్నారు. గురజాడ ప్రపంచానికి తెలుగు భాష ఔనిత్యాన్ని చాటి చెప్పిన మహా కవి అన్నారు. గురజాడ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.
News November 30, 2025
2వేల టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాం: VZM కలెక్టర్

ఒక వేళ వర్షాలు పడితే ధాన్యం పాడవ్వకుండా 2వేల టార్పాలిన్లు సిద్ధంగా ఉంచామని రాం సుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో నేడు నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మరో 1600 టార్పాలిన్లు జిల్లాకు రానున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. చీపురుపల్లి, బొబ్బిలి డివిజన్లలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని, విజయనగరం డివిజన్లో త్వరలో ప్రారంభమవుతుందన్నారు.
News November 30, 2025
ఎక్కువ కేసులు పరిష్కరించాలి: SP

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌కు ముందే ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ దామోదర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. నాన్ బెయిలబుల్ వారంట్ల అమలుకు ప్రత్యేక బృందాలు, దర్యాప్తులో ఈ-సాక్ష్య యాప్ తప్పనిసరన్నారు. సిసిటీఎన్ఎస్‌లో కేసుల అప్లోడింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


