News January 2, 2025

‘తాటిపూడి రిజ‌ర్వాయ‌ర్‌కు గొర్రిపాటి పేరు పున‌రుద్ద‌ర‌ణ‌’

image

తాటిపూడి రిజ‌ర్వాయ‌ర్‌కు గొర్రిపాటి బుచ్చి అప్పారావు రిజ‌ర్వాయ‌ర్‌గా పేరును పున‌రుద్ద‌రిస్తూ ప్ర‌భుత్వం గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రిజ‌ర్వాయ‌ర్‌కు గొర్రిపాటి పేరును పున‌రుద్ద‌రించాల‌ని ఎస్‌.కోట ఎంఎల్ఏ కోళ్ల ల‌లిత‌కుమారి కూడా మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో ఈ అంశాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని చేసిన కృషి ఫ‌లితంగా పేరు పున‌రుద్ద‌ర‌ణ జ‌రిగిందని అధికారులు ప్రకటించారు.

Similar News

News January 17, 2025

VZM: జిల్లాలో రూ.22 కోట్ల మద్యం అమ్మకాలు

image

విజయనగరం జిల్లాలో గడిచిన మూడు రోజుల్లో రూ.22 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో మందుబాబులు వైన్ షాపుల ముందు భారీగా క్యూ కట్టారు. జిల్లాలో 177 మద్యం షాపులు, 28 బార్లు ఉండగా 42,000 మద్యం కేసుల విక్రయాలు జరిగాయి. గతేడాది రూ.20 కోట్లు అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది రూ.2 కోట్లు అదనంగా ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

News January 17, 2025

పార్వతీపురం: స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్-

image

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ఒక శనివారం “స్వచ్ఛత” కోసం అంకితం కావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఆకాంక్షించారన్నారు. అందులో భాగంగా ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

News January 17, 2025

గడ్డం ఉమ ట్వీట్‌కు లోకేశ్ రిప్లై

image

వైఎస్ జగన్ అభిమాని గడ్డం ఉమ ట్విటర్ వేదికగా కోరిన సాయానికి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విజయనగరం చిన్నారి శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారని, ట్రీట్‌మెంట్‌కు రూ.10 లక్షలు ఖర్చవుతుందని అన్నారు. పేద కుటుంబం కావడంతో చిన్నారి వైద్యానికి సాయం అందించాలంటూ ఆమె ‘X’లో లోకేశ్‌ను కోరారు. దీనికి స్పందించిన లోకేశ్ చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.