News August 27, 2024

తాడికొండ: నిద్రిస్తున్న బాలికపై ఇద్దరు అత్యాచారయత్నం

image

నిద్రిస్తున్న బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారయత్నం చేసిన ఘటన తాడికొండలో వెలుగులోకొచ్చింది. సీఐ కె. వాసు వివరాల మేరకు 9వ తరగతి చదువుతున్న బాలిక ఈనెల 21న ఇంట్లో ఉంది. గమనించిన ఇద్దరు బాలురు ఒకరు నోరు మూసి, మరొకరు అత్యాచారానికి యత్నించారు. ఆ సమయంలో వేరే యువతి రావడంతో పారిపోయారు.బాలిక పోలీసులను ఆశ్రయించి వారిలో ఒకరు ప్రేమపేరుతో వేధిస్తున్నాడని, తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది.

Similar News

News April 20, 2026

ఆన్‌లైన్‌లో PGRS అర్జీలు సమర్పించవచ్చు: కలెక్టర్

image

గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా సమర్పించవచ్చని అన్నారు. 1100 టోల్ ఫ్రీ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News April 19, 2026

భవననిర్మాణ కార్మికుల పేర్లు నమోదు చేసుకోవాలి: GNT కలెక్టర్

image

భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లను కార్మికశాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. వివాహ కానుక, ప్రసూతి సహాయంగా రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్య క్రియలకు రూ.20 వేలు అందించే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు.