News November 11, 2024
తాడిపత్రిలో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ హల్‌చల్
తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం ఐదో రోడ్డులో ఆదివారం రాత్రి గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. కొందరి యువకులు గంజాయి సేవించి కేకలు వేస్తూ బైకులపై తిరుగుతూ హల్‌చల్ చేశారు. ప్రశ్నించిన కాలనీవాసులపై దాడికి తెగబడ్డారు. ఒక బైక్‌ను ధ్వంసం చేశారు. కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కృష్ణాపురం కాలనీకి వెళ్లి విచారణ చేపట్టారు.
Similar News
News December 8, 2024
అనంతపురం పోలీసుల కస్టడీలో బోరుగడ్డ
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఓ కేసు విచారణలో భాగంగా నిన్న అనంతపురం పోలీసులు ఆయనను మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా అక్టోబర్ 17న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
News December 8, 2024
ఆత్మకూరులో ఫీల్డ్ అసిస్టెంట్ సూసైడ్..కారణమిదే
ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ నరేశ్ శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతను అప్పుల ఒత్తిడి అధికమై చనిపోయినట్లు తెలుస్తోంది. రూ. లక్షలలో అప్పుచేసి తండ్రి కొద్ది కాలం కిందట మృతిచెందగా.. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మరింత కుమిలిపోయిన అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News December 8, 2024
వరకట్న వేధింపుల కేసులో ముద్దాయిలకు జైలు శిక్ష
వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో ముద్దాయిలకు జైలు శిక్ష విధించినట్టు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ముదిగుబ్బ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన చెన్నకేశవరెడ్డి కుమార్తె స్రవంతిని కొత్తచెరువుకు చెందిన ఓం ప్రకాశ్ రెడ్డికి ఇచ్చి 2015లో వివాహం చేశారు. అయితే అదనపు కట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు ఆమెపై హత్యాయత్నం చేశారు. ఈ కేసులో ముద్దాయిలకు మూడేళ్ల జైలు శిక్ష విధించారని ఎస్పీ తెలిపారు.