News August 28, 2024
తాడిపత్రిలో ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి
తాడిపత్రి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ సమీపంలో కడప-తాడిపత్రి ప్రధాన రహదారిపై స్కార్పియో వాహనం, బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News September 10, 2024
అనంతపురం చేరుకున్న భారత్-ఏ, బీ జట్ల ప్లేయర్లు
అనంతపురంలో దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ క్రికెట్ పోటీలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. బెంగళూరులో తొలి మ్యాచ్ ఆడిన భారత్-ఏ, బీ జట్లు నిన్న రాత్రి అనంతపురానికి చేరుకున్నాయి. కేఎల్ రాహుల్, దూబే, పంత్, మయాంక్, రియాన్ పరాగ్ తదితర క్రికెటర్లకు హోటళ్లలో ఘన స్వాగతం పలికారు. క్రికెట్లరను చూడటానికి అభిమానులు హోటల్ వద్ద పడిగాపులు కాశారు. క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
News September 10, 2024
తాడిపత్రిలో అగ్నిప్రమాదం
తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 10, 2024
అనంతపురంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ
అనంతపురంలో ఈ నెల 11న జరగనున్న వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు విగ్రహాల ఉరేగింపు ప్రారంభం కావాలని తెలిపారు. 10 అడుగుల కంటే ఎత్తయిన విగ్రహాలను పంపనూరు కెనాల్లో, 10 అడుగులకు తక్కువ విగ్రహాలను రాచన పల్లి వంకల్లో నిమజ్జనం చేయాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.