News January 3, 2025

తాడిపత్రిలో నటి మాధవీ లతపై పోలీసులకు ఫిర్యాదు

image

తాడిపత్రిలో సినీ నటి మాధవీ లతపై రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, మహిళా కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ గౌస్ బాషాకు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. గత నెల 31న జేసీ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంపై మాధవీ లత తప్పుడు ఆరోపణలు చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News January 19, 2025

అనంత: మాజీ ఎమ్యెల్యే సోదరుడిపై కేసు నమోదు

image

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిపై శనివారం టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముత్యాలు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 2022 సంవత్సరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లపై అసభ్య పదజాలంతో దూషించడంతో కేసు నమోదు చేసినట్లు రాప్తాడు సీఐ శ్రీహర్ష వెల్లడించారు.

News January 19, 2025

ఈనెల 21న శ్రీ సత్యసాయి జిల్లాకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక

image

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతా హుస్సేన్ ఈనెల 21న శ్రీ సత్యసాయి జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం కదిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారన్నారు. అనంతరం రాందాస్ తండా, బోడే నాయక్ తండాను పరిశీలిస్తారని తెలిపారు. ముదిగుబ్బ మండలం మీదుగా ఉదయం 11 గంటలకు జొన్నల కొత్తపల్లి తండాను సందర్శిస్తారని వెల్లడించారు.

News January 18, 2025

JC ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన నటి మాధవీలత

image

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ JC ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. MAA ట్రెజరర్ శివ బాలాజీకి ఫిర్యాదు పత్రం అందచేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కాగా న్యూ ఇయర్ సందర్భంగా మాధవీలతపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జేసీ తర్వాత క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.