News January 23, 2026

తాడిపత్రిలో పొలిటికల్ టెన్షన్

image

సవాల్.. ప్రతి సవాల్‌తో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేతిరెడ్డి సవాల్ విసరగా మీ ఇంటి వద్దే సవాల్ స్వీకరిస్తామని టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు, జేసీ అభిమానులు నేడు ఎమ్మెల్యే అస్మిత్ ఇంటి వద్దకు తరలిరావాలని సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Similar News

News February 18, 2026

ఆసిఫాబాద్ జిల్లాలో కోడ్ ఎత్తివేత: కలెక్టర్

image

జిల్లాలో అమలులో ఉన్న మున్సిపల్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎత్తివేసినట్లు ASF కలెక్టర్ హరిత తెలిపారు. 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల భాగంగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలలో కౌన్సిలర్, ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 17తో పూర్తయిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియమావళి ఎత్తివేసినట్లు వెల్లడించారు.

News February 18, 2026

ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ అప్లై చేసుకోండి

image

పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం అతిపెద్ద టాస్క్. దీనికి బ్యాంకులు/ పోస్టాఫీసుల్లో క్యూలో నిలబడాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు. జీవన్ ప్రమాణ్ యాప్‌తో పాటు ఫేస్ అథెంటికేషన్ కోసం AadhaarFaceRD యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఆధార్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్, బ్యాంక్ వివరాలు ఇవ్వాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తయ్యాక సర్టిఫికెట్ ఆటోమెటిక్‌గా సంబంధిత బ్యాంక్‌కు వెళ్తుంది.

News February 18, 2026

ఈ-పంట నమోదు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

image

వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 86 శాతం ఈ-పంట నమోదు పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను యుద్ధప్రతిపాదికన ముగించాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ఉద్యాన, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.