News June 30, 2024
తాడిపత్రిలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

తాడిపత్రి మండలంలో ఆదివారం రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని ఎల్లనూరు రోడ్డు రైల్వే గేటు సమీపంలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి రైల్వే పోలీసులు చేరుకుని పరిశీలించారు. చెడు వ్యసనాలకు బానిసై జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 8, 2025
అనంత: అనాధ పిల్లలకు హెల్త్ కార్డుల పంపిణీ

అనాధ పిల్లల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని అనాధ పిల్లలకు హెల్త్ కార్డులను తయారు చేయించింది. అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ కార్డులను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ సేవను అందిస్తున్న సంగతి తెలిసిందే.
News December 8, 2025
అనంత: ఈనెల 10లోపు టెట్.!

అనంతపురంలో ఈనెల 10 నుంచి 21 వరకు TET పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన 7 కేంద్రాల్లో సెషన్ వన్ ఉదయం 9.30 నుంచి 12 వరకు, సెషన్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 షిఫ్టుల్లో జరుగుతాయని వెల్లడించారు.
News December 8, 2025
అనంతపురంలో నేడు ప్రజా వేదిక: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ 1100ను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, అర్జీల పరిస్థితిని తెలుసుకోవాలన్నా 1100కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


