News December 15, 2024

తాడిపత్రిలో వైభవంగా ఆకాశ దీపోత్సవం

image

తాడిపత్రిలో వెలిసిన అతి పురాతనమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో వైభవంగా ఆకాశ దీపోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ చింతల వెంకటరమణ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయం ఆవరణంలో ఉన్న ధ్వజ స్థంభంపై ఆకాశ దీపోత్సవం వెలిగించారు. పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు.

Similar News

News November 26, 2025

అనంతపురం: ఆనంద్‌ది పరువు హత్య..?

image

ప్రేమ పేరుతో రప్పించి యనకళ్లు గ్రామానికి చెందిన వాల్మీకి బోయ ఆనంద్‌ను బ్రహ్మాసముద్రం మండలంలో హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బుధవారం ఏపీ వాల్మీకి బోయ సంఘం నాయకులు అక్కులప్ప, మాధవయ్య తదితరులు ఆనంద్ కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐ హరినాథ్‌కు వినతి పత్రం అందించారు.

News November 26, 2025

జిల్లాకు రాష్ట్రస్థాయి ఓవరాల్ ఛాంపియన్ షిప్

image

వినుకొండలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ గేమ్స్‌లో బాలికల అండర్-17 అథ్లెట్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అనంతపురం జిల్లా గర్ల్స్ ఓవరాల్ ఛాంపియన్‌ షిప్‌ను పొందారు. ఇందులో పాల్గొన్న వర్షిత, ఇంద్ర లేఖ, మౌనిక తదితర 14 మంది బాలికలను ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అభినందించారు. కార్యక్రమంలో గేమ్స్ అబ్జర్వర్ ప్రసాద్ రెడ్డి, ప్రవీణ, అనంతపురం జిల్లా మేనేజర్ పీడీ చల్లా ఓబులేసు, కోచ్ నారాయణ, చలపతిలు పాల్గొన్నారు.