News February 25, 2025

తాడిపత్రిలో సినీ నటి మాధవీలతపై కేసు నమోదు

image

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సినీ నటి మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మహిళలను కించపరిచేలా ఆమె మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. దీంతో మాధవీలతపై కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ పోలీసులు తెలిపారు.

Similar News

News March 23, 2025

కదిరి: ప్రేమ పేరుతో మోసం.. కేసు నమోదు

image

కదిరికి చెందిన మనోహర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని, నిజాంవళి కాలనీకి చెందిన షేక్ సోనీ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.18 లక్షల రుణాలను తన పేరుతో వివిధ బ్యాంకుల్లో పొందాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని తిరిగి చెల్లించకుండా, తనను బెదిరిస్తున్నట్లు తెలిపారు.

News March 23, 2025

గుత్తిలో కేజీ చికెన్ రూ.170

image

అనంతపురం జిల్లా గుత్తిలో కేజీ చికెన్ ధర రూ.170-180లుగా ఉంది. గుంతకల్లులో కిలో రూ.150-160 చొప్పున అమ్ముతున్నారు. ఇక అనంతపురంలో కేజీ రూ.140-150లతో విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. గత ఆదివారంతో పోల్చితే నేడు చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తి, గుంతకల్లులో కేజీ మటన్ ధర రూ.700-750లుగా ఉంది.

News March 23, 2025

JNTUలో బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం.. సిలబస్‌లో మార్పులు

image

అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీలోని వీసీ కాన్పరెన్స్ హాల్‌లో శనివారం బోర్డు ఆఫ్ స్టడీస్ (BOS) సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి వీసీ హెచ్.సుదర్శన రావు మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలోని బీటెక్ 3, 4 సంవత్సరాలకు R23 సిలబస్‌లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్లు భానుమూర్తి, సత్యనారాయణ, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

error: Content is protected !!