News April 27, 2024
తాడిపత్రిలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే..!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టులో బయలుదేరి 9:45 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి 10:30 గంటలకు తాడిపత్రి చేరుకుంటారు. 11 గంటల నుంచి 11:45 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 12 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని తిరుపతి జిల్లా వెంకటగిరికి వెళ్లనున్నారు.
Similar News
News December 9, 2025
వాహనదారులారా.. రూల్స్ అతిక్రమించకండి: ఎస్పీ

అనంతపురం జిల్లా పోలీస్ అధికారులకు ఎస్పీ జగదీశ్ పలు సూచనలు చేశారు. వాహనదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. వేగం, ప్రమాదకర డ్రైవింగ్, మద్యం మత్తు, నిద్రమత్తు డ్రైవింగ్ను పూర్తిగా నివారించాలన్నారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు, రోడ్డు సంకేతాలను వాహనదారులు కచ్చితంగా పాటించాలన్నారు. బండి పత్రాలు ఉండాలని, హెల్మెట్/సీటు బెల్ట్ తప్పనిసరిగా వాడలని, లేనిచో చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు.
News December 9, 2025
అనంత జిల్లాలో యువకుడి దారుణ హత్య

అనంతపురం(D) బుక్కరాయ సముద్రం పంచాయతీ పరిధిలోని వీరభద్ర కాలనీకి చెందిన సాయిచరణ్(23) దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయి చరణ్ స్నేహితులే పొలంలో కొట్టి చంపి, అనంతరం బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 9, 2025
అనంత: పోలీసుల PGRSకు 128 పిటిషన్లు.!

అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన PGRSకు ప్రజల నుంచి 128 పిటిషన్లు వచ్చినట్లు జిల్లా SP జగదీశ్ తెలిపారు. ఫిర్యాదుదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరానికి సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదులు పంపించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.


