News April 30, 2024
తాడిపత్రిలో 18, ఉరవకొండలో 11 మంది పోటీ

అనంత జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలకు 113 మంది పోటీలో ఉన్నారు. ఉరవకొండ మినహా మిగతా 7 చోట్లా 23 మంది నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. అత్యధికంగా తాడిపత్రి 18, తక్కువగా ఉరవకొండలో 11 మంది పోటీలో ఉన్నారు. అనంత అర్బన్, కళ్యాణదుర్గంలో 15, శింగనమల, గుంతకల్లులో 14, రాయదుర్గం, రాప్తాడులో 13 చొప్పున పోటీలో నిలిచారు. ఇక అనంత ఎంపీకి 21మంది బరిలో ఉన్నారు. ఇక్కడ ఒక్కరు కూడా ఉపసంహరించుకోలేదు.
Similar News
News April 14, 2026
అనంతపురంలో 48,116 మంది విద్యార్థుల ఎదురు చూపు..!

ఇంటర్ ఫలితాల విడుదలకు ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 10.31 గంటలకు రిజల్ట్స్ వెలువడనున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రథమ సంవత్సరం 24,568 మంది, ద్వితీయ సంవత్సరం 23,578 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఆర్ఐఓ రమణ నాయక్ తెలిపారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 13, 2026
హౌసింగ్ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

అనంతపురం కలెక్టర్ ఆనంద్ హౌసింగ్ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పీఎంఏవై అర్బన్, గ్రామీణ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. ఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
News April 13, 2026
PGRSలో 169 పిటిషన్లు స్వీకరించాం: SP జగదీష్

అనంతపురం పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 169 పిటిషన్లు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. వారి సమస్యలను తెలుసుకుని పోలీసు అధికారులకు ఫోన్ చేసి, ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. దంపతుల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, రస్తా వివాదాలు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు.


