News April 4, 2024
తాడిపత్రి: పింఛన్ కోసం వెళ్లి ఇద్దరు వృద్ధులు మృతి

పింఛన్ కోసం వెళ్లి ఇద్దరు వృద్ధులు మృతి చెందిన ఘటన తాడిపత్రి మండలంలో చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని టైలర్స్ కాలనీకి చెందిన హుసేన్ మియా పింఛన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లి వడదెబ్బకు గురై మృతి చెందారు. అలాగే చిన్నపొలమడ గ్రామానికి చెందిన ఆదెమ్మ నిన్న పింఛన్ కోసం వెళ్లి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.
Similar News
News March 5, 2026
సీఎంతో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం

అమరావతి ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెండింగ్ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతపురం ప్రగతికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం కీలక దిశానిర్దేశం చేశారు.
News March 5, 2026
బెంబేలెత్తుతున్న అనంతపురం జిల్లా ప్రజలు

మధ్యాహ్నం ఎండలు, రాత్రి ఉక్కపోతతో అనంత జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఈనెల 1న దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. బుధవారం 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. గుంతకల్లు మండలంలో 39.8, యల్లనూరులో 38.4, పెద్దపప్పూరులో 38.3, తాడిపత్రిలో 37.7, బి.సముద్రంలో 37.6 డిగ్రీలు నమోదయ్యాయి.
News March 4, 2026
‘జనగణనను పారదర్శకంగా నిర్వహించండి’

అనంతపురం జిల్లా జనగణనను అధికారులు, సిబ్బంది బాధ్యతగా చేపట్టాలని డిఆర్ఓ, జిల్లా సెన్సెస్ అధికారి మలోలా సూచించారు. జేఎన్టీయూలో జరిగిన శిక్షణలో డిజిటల్ విధానంపై అవగాహన కల్పించారు. సీఎంఎంఎస్ ద్వారా 33 అంశాల నమోదు, మొబైల్ యాప్ వినియోగంపై వివరించారు. ఎక్కడా లోపాలు లేకుండా జనగణన పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.


