News March 25, 2024

తాడిపత్రి: పెళ్లి రద్దు కావడంతో యువకుడి ఆత్మహత్య

image

తాడిపత్రి మండలంలోని గంగాదేవిపల్లికి నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగరాజు ఐచర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవల నంద్యాలలో పెళ్లి సంబంధం కుదిరింది. కొన్ని కారణాలతో ఆ సంబంధం ఆగిపోయింది. దీంతో యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై తెల్లవారుజామున ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.

Similar News

News September 14, 2024

గుంతకల్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

image

ముంబై-చెన్నై మధ్య ప్రధాన జంక్షన్‌గా గుంతకల్లుకు పేరుంది. దక్షిణ మధ్య రైల్వేలోని 5 ప్రధాన డివిజన్‌లలో గుంతకల్ డివిజన్ 3వది. బ్రిటిష్ ఈస్టిండియా, బ్రిటిష్ ఇండియా పరిపాలన కాలంలోనూ రైలు ప్రయాణాల్లో గుంతకల్ ప్రాభవం పొందింది. అయితే పాత గుంతకల్లులో వెలసిన గుంతకల్లప్ప స్వామి పేరు మీద గుంతకల్లుకు ఆ పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఈ నియోజకవర్గంలో కసాపురం, హజారత్ వలి మస్తాన్ దర్గా ప్రముఖ దర్శనీయ ప్రదేశాలు.

News September 13, 2024

అనంత: నూరుల్లా దారుణ హత్యకు వివాహేతర సంబంధమే కారణం

image

తాడిపత్రిలో గురువారం రాత్రి నూరుల్లా(34) అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వివరాలను సీఐ సాయిప్రసాద్ వెళ్లడించారు. ‘నూరుల్లా ఆర్జాస్ ఉక్కు పరిశ్రమలో ఉద్యోగం చేసేవారు. కొన్నేళ్ల నుంచి చిన్న బజార్‌కు చెందిన మహిళతో సన్నిహితంగా ఉన్నారు. నిన్న రాత్రి విధులు ముగించుకొని సదరు మహిళ ఇంటి వద్దకు వెళ్లడం ఆమె బంధువులు చూశారు. ఆవేశంతో బండరాళ్లతో కొట్టి హత్య చేశారు’ అని తెలిపారు.

News September 13, 2024

శ్రీ సత్యసాయి: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరు దుర్మరణం

image

శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి వద్ద అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం వైపు నుంచి కదిరి వైపునకు బైక్‌పై వెళ్తుండగా పక్కనున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.