News May 24, 2024
తాడిపత్రి రాళ్లదాడిలో మరో 11మంది అరెస్ట్

తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య జరిగిన రాళ్లదాడికి సంబంధించి మరో 11మందిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. రాళ్లదాడిపై ఇప్పటికే సిట్ బృందం దర్యాప్తు చేసి అల్లర్లలో 728 మంది ప్రమేయం ఉందని నివేదికను అందించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 91 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం మరో 11 మందిని అరెస్టు, 9మంది బైండోవర్ చేసినట్లు తెలిపారు.
Similar News
News February 9, 2025
బ్రహ్మసముద్రం: పురుగు మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య

బ్రహ్మసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బొమ్మగానిపల్లి తండా గ్రామంలో లక్ష్మీబాయి అనే వృద్ధురాలు శనివారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 9, 2025
అదుపుతప్పి కారు బోల్తా.. మహిళ మృతి

కర్నూలు(D) వెల్దుర్తిలోని మంగంపల్లి సమీపాన శనివారం కారు బోల్తాపడి మహిళ మృతిచెందింది. సత్యసాయి(D) బత్తలపల్లి(M) గుమ్మలకుంటకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, మహేశ్వరి(32) HYDలో ఉంటున్నారు. తమ్ముడి వివాహానికి ఏడాదిన్నర కుమారుడు వియాన్స్, మరిది అమర్‌నాథ్‌తో కలిసి కారులో బయలుదేరారు. మంగంపల్లి వద్ద కుక్క అడ్డురావడంతో బోల్తాపడింది. తన ఒడిలో ఉన్న వియాన్స్‌ను అదిమి పట్టుకుని ప్రాణాలు కాపాడి, తాను మృతిచెందింది.
News February 9, 2025
పేరూరు గ్రామం నుంచి తిరుమలకు పాదయాత్ర

పేరూరు గ్రామం నుంచి తిరుమలకు పంచాగం మోహన్ స్వామి ఆధ్వర్యంలో భక్తులు శనివారం పాదయాత్రను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి మాల ధరించిన భక్తులు గ్రామంలోని ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి, భజన చేసుకుంటూ తిరుమలకు పాదయాత్ర చేస్తామన్నారు. కార్యక్రమంలో దాసరి రాజ, వెంకటరెడ్డి, బెస్త నాగరాజు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.