News March 16, 2025
తాడూర్: ప్రభుత్వ పాఠశాలల్లో AI బోధన ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, డీఈఓ రమేష్ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తరగతులను ప్రారంభించారు. ఈ తరగతులు విద్యార్థుల అభ్యాసాలను మెరుగుపర్చడంతో పాటు, తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని 13 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం అమలవుతోందన్నారు.
Similar News
News December 4, 2025
కలెక్టరేట్లో ప్రతిష్టాపనకు సిద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహం: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యిందని, విగ్రహ ప్రతిష్టాపన పనులు చివరి దశకు చేరాయని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం పరిశీలించారు. కలెక్టరేట్‌కు మరింత ఆకర్షణ వచ్చే విధంగా విగ్రహ ఏర్పాటు ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News December 4, 2025
ఏపీకి జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నోటీసులు

తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మేరకు పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారంలోపు ప్రాజెక్టు వాస్తవ స్థితిపై సమాధానం ఇవ్వాలని పేర్కొంది. పోలవరం-నల్లమల సాగర్ డీపీఆర్ కోసం టెండర్లు పిలవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
News December 4, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓భద్రాచలంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు
✓ చండ్రుగొండ అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
✓ ఎన్నికల ప్రచారానికి అనుమతి తప్పనిసరి: మణుగూరు డీఎస్పీ
✓ కొత్తగూడెం నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
✓ సైబర్ మోసానికి పాల్పడితే 1930కు కాల్ చేయండి: ఇల్లందు డీఎస్పీ
✓ కరకగూడెం: ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లు చోరీ
✓ భద్రాచలం: తానా వేదికపై ఆదివాసి చిన్నారి ప్రతిభ
✓ ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్


