News March 16, 2025
తాడూర్: ప్రభుత్వ పాఠశాలల్లో AI బోధన ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, డీఈఓ రమేష్ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తరగతులను ప్రారంభించారు. ఈ తరగతులు విద్యార్థుల అభ్యాసాలను మెరుగుపర్చడంతో పాటు, తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని 13 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం అమలవుతోందన్నారు.
Similar News
News April 18, 2025
కాంగ్రెస్ బతుకు అగమ్యగోచరమే: బండి సంజయ్

TG: రాహుల్, సోనియా గాంధీ పేర్లను ED ఛార్జ్‌షీట్‌లో చేర్చడంపై HYD ఈడీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘దేశ ప్రజలంతా ఛీత్కరించుకోవడం, దేశాన్ని ఇంకా దోపిడీ చేయలేకపోయామనే నిరాశలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వివేకం, వ్యక్తిత్వం వదిలేసి PMపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. వారి భాష చూస్తే 2029 కాదు, యుగం గడిచినా ఆ పార్టీ బతుకు అగమ్యగోచరమే’ అని ట్వీట్ చేశారు.
News April 18, 2025
గద్వాల: రామకృష్ణ మృతి.. ట్రాన్స్‌జెండర్, మరో వ్యక్తి రిమాండ్

గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రానికి చెందిన రామకృష్ణ ఐదు రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందాడు. అతడి మృతిపై పలు అనుమానాలున్నాయని పేర్కొంటూ, ట్రాన్స్‌జెండర్ శివానితో పాటు మరో ముగ్గురిపై భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మల్దకల్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. గురువారం ట్రాన్స్‌జెండర్ శివాని, రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.
News April 18, 2025
అరుదైన ఘనత సాధించిన హెడ్

IPL: వాంఖడేలో MIతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో వేగంగా 1000 రన్స్ పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. మొత్తంగా 575 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ జాబితాలో తొలి స్థానంలో రస్సెల్(545), హెడ్ తర్వాత క్లాసెన్(594), సెహ్వాగ్(604), మ్యాక్స్‌వెల్(610), యూసుఫ్ పఠాన్(617), నరైన్(617) ఉన్నారు.