News February 11, 2025
తాడేపల్లిగూడెం : బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

తాడేపల్లిగూడెం పట్టణం మూడో వార్డుకు చెందిన మైనర్ బాలికకు ఈ నెల 20వ తేదీన వివాహం చేయడానికి నిశ్చయించగా.. దానిని ఐసీడీఎస్ అధికారులు సోమవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ దుర్గా భవాని బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేసేందుకు అంగీకార పత్రాన్ని తీసుకున్నారు. మహిళా పోలీస్ విజయ్ కుమారి, అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు.
Similar News
News December 27, 2025
భీమవరం: ప్రత్యేక ఉపకారాగారాన్ని సందర్శించిన జిల్లా జడ్జి

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో శనివారం భీమవరం ప్రత్యేక ఉపకారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు S. శ్రీదేవి సందర్శించారు. ముద్దాయిలతో ఆయన మాట్లాడారు. బెయిల్ వచ్చి కూడా జామీన్లు సమర్పించని కారణంగా విడుదల కాని ముద్దాయిల వివరాలు నమోదు చేసుకున్నారు. ముద్దాయిల భోజన వసతులను, వైద్య సదుపాయాలను ఆరా తీశారు.
News December 27, 2025
ఒక్కరోజు ముందే పెన్షన్ పంపిణీ: కలెక్టర్

నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జనవరి 1 ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను ఒకరోజు ముందుగానే ఈనెల 31 పంపిణీ చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సిబ్బందికి సూచించారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పెన్షన్ల పంపిణీ అవసరమయ్యే నగదును సిద్ధం చేసుకోవాలన్నారు.
News December 27, 2025
ఈనెల 28న పెదమైనవానిలంకలో కేంద్ర మంత్రి పర్యటన

ఈనెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైనవానిలంకలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


