News May 4, 2024
తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ బదిలీ

తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ బదిలీ అయ్యారు. ఈయన జిల్లా కలెక్టరేట్ విధుల్లో చేరనున్నారు. ఆయన స్థానంలో మున్సిపల్ ఇంజినీర్ డి.మురళీకృష్ణకు మున్సిపల్ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మురళి కృష్ణ కమిషనర్గా వ్యవహరించనున్నారు. శామ్యూల్ ఆకస్మిక బదిలీపై సర్వత్ర చర్చ సాగుతోంది.
Similar News
News September 18, 2025
నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.. జేసీ హెచ్చరిక

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీ-సర్వే, పీజీఆర్ఎస్, ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. ముఖ్యంగా పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను స్వయంగా మాట్లాడి పరిష్కరించాలని జేసీ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
News September 17, 2025
ఉండిలో ప్రభుత్వ భూముల పరిశీలన.. చర్యలకు కలెక్టర్ ఆదేశం

ఉండిలోని ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం పరిశీలించారు. ఉండి కూడలి డైవర్షన్ ఛానల్ వద్ద ఇరిగేషన్, పీడబ్ల్యుడీ, జడ్పీ స్థలాలను పరిశీలించిన ఆమె, ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలకు సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.
News September 17, 2025
హార్టీకల్చర్ కోర్సులకు వెబ్ ఆప్షన్లకు అవకాశం: శ్రీనివాసులు

తాడేపల్లిగూడెం (M) వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధి కళాశాలలో బీఎస్సీ హార్టీకల్చర్, ఫారెస్టరీ కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ బి. శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో నమోదు చేసుకున్న దరఖాస్తుదారులకు ఈ నెల 18వ తేదీ లోపు కాలేజీ ఎంపికకు అవకాశం కల్పించారన్నారు.