News March 9, 2025
తాడేపల్లిలో అంబాజీపేట యువకుడిపై దాడి

అంబాజీపేట మండలం వక్కలంకకి చెందిన వాసంశెట్టి సంతోష్‌కి విజయవాడకు చెందిన హరికృష్ణకు తాడేపల్లి(M) వడ్డేశ్వరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఘర్షణ జరిగింది. దీంతో అతడిని చంపాలని గ్యాంగ్‌తో కలిసి హత్యాయత్నం చేసేందుకు యత్నించారు. అతడు ఒంటరిగా కారులో వెళుతున్న సమయంలో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంతోష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.
Similar News
News March 17, 2025
జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్‌కు బెయిల్

జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పు ఇవాళ్టికి వాయిదా వేసింది. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు రేవతి, తన్వీ యాదవ్‌లకు బెయిల్ మంజూరు చేసింది. వారిపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.
News March 17, 2025
వనపర్తి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

వనపర్తి జిల్లాలో నిన్నటితో పోలిస్తే ఈరోజు ఉష్ణోగ్రతలు తగ్గినట్లు వాతావరణశాఖ తెలిపింది. నిన్న అత్యధిక ఉష్ణోగ్రత 41.3 డిగ్రీలు నమోదు కాగా, ఈరోజు40.7 డిగ్రీలు నమోదయింది. నిన్నటి కంటే 0.6 డిగ్రీలు తగ్గింది. గత 24 గంటల్లో (నిన్న ఉ.8.30 నుంచి నేడు ఉ.8.30 వరకు) వనపర్తిలోఅత్యధిక ఉష్ణోగ్రత40.7 డిగ్రీలు నమోదు కాగా, అత్యల్ప ఉష్ణోగ్రత పెబ్బేర్‌లో 38.7 డిగ్రీలు నమోదయింది.
News March 17, 2025
కరీంనగర్: ఇంటర్ పరీక్షల్లో 621 మంది విద్యార్థుల గైర్హాజరు

కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పెపర్ 1 ప్రశాంతంగా ముగిసినట్లు సోమవారం జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 19,425 మంది విద్యార్థులకు గాను 18,804 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు 621 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.