News February 10, 2025
తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద కెమెరాలు

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద మెగా కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆయన నివాసం వద్ద చెలరేగిన మంటలను దృష్టిలో ఉంచుకుని అక్కడ నిఘా పెంచారు. మొత్తం ఎనిమిది కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి నుంచి వచ్చే చిత్రాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మానిటర్ చేయనున్నారు.
Similar News
News October 18, 2025
ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు రూ. 220 కోట్ల బకాయిలు: కొప్పుల ఈశ్వర్

జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిధిలోని సంక్షేమ శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలకు రావాల్సిన రూ. 220 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించబడలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. జగిత్యాలలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సరుకుల సరఫరా కూడా నిలిచిపోయిందని కొప్పుల తెలిపారు.
News October 18, 2025
కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్న విద్యార్థిని

అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఐసీడీఎస్ నిర్వహించిన ‘బాలికల హక్కులను కాపాడడం, లింగ ఎంపిక, గర్భస్రావ నిషేధ చట్టం’ అంశంపై డ్రాయింగ్ కాంపిటీషన్ను నిర్వహించారు. ఇందులో సుండుపల్లి జడ్పీ విద్యార్థిని నవ్యలత మొదటి స్థానంలో గెలిచింది. ఈ క్రమంలో ఐసీడీఎస్ అధికారులు బహుమతిని కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతులమీదుగా విద్యార్థినికి అందించారు. ఈ కాంపిటీషన్ కోసం ప్రోత్సహించిన పాఠశాల హెచ్ఎంను అభినందించారు.
News October 18, 2025
ఒకేసారి ఇద్దరు యువతులతో యువకుడి పెళ్లి!

ఒక్కరితో సంసారమే కష్టమవుతోన్న ఈ రోజుల్లో ఓ యువకుడు ఒకేసారి ఇద్దరు యువతుల్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగింది. వసీమ్ షేక్ తన ఇద్దరు స్నేహితురాళ్లు షిఫా షేక్, జన్నత్ను ఒకే వేదికపై పెళ్లాడాడు. వాళ్లు ముగ్గురూ చాలా ఏళ్లుగా క్లోజ్ ఫ్రెండ్స్ అని, ఒకరి భావోద్వేగాలను మరొకరు అర్థం చేసుకుని ఇలా ఒక్కటయ్యారని సన్నిహితులు తెలిపారు. దీనిపై SMలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.