News February 10, 2025

తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద కెమెరాలు

image

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద మెగా కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆయన నివాసం వద్ద చెలరేగిన మంటలను దృష్టిలో ఉంచుకుని అక్కడ నిఘా పెంచారు. మొత్తం ఎనిమిది కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి నుంచి వచ్చే చిత్రాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్‌ నుంచి మానిటర్ చేయనున్నారు.

Similar News

News March 14, 2026

శ్రీశైలం ఆలయ ప్రవేశ మార్గాల్లో డీఎఫ్ఎండీలు ఉపయోగించాలి: ఎస్పీ

image

ఆలయం లోపలికి ప్రవేశించు మార్గాలలో తప్పనిసరిగా డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (DFMD )ను ఉపయోగించాలని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఆదేశించారు. శనివారం బందోబస్తు నిమిత్తం వచ్చిన సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సాధారణ భక్తులతో పాటు ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి లోపలికి అనుమతించాలన్నారు. శ్రీశైలం పరిసర ప్రాంతాలలో రోడ్డు ఓపెనింగ్ పార్టీ (ROP)లు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నారు.

పరీక్షలు పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

image

టెన్త్ పరీక్షలు అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులను కలెక్టర్ హైమావతి ఆదేశించారు. శనివారం రంగధాంపల్లి, రాజగోపాల్‌పేట ఉన్నత పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఎస్ఎస్సీ-2026 బోర్డు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, పరీక్ష గదుల్లో ఎలాంటి పుస్తకాలు ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా అన్ని వసతులు కల్పించాలని చీఫ్ సూపరింటెండెంట్‌కు సూచించారు.