News December 27, 2024
తాడేపల్లిలో రైల్వే కోడూరు కానిస్టేబుల్ మృతి

రైల్వే కోడూరుకు చెందిన కానిస్టేబుల్ రాజయ్య గురువారం తాడేపల్లిలో మృతి చెందాడు. సీఎం క్యాంప్ కార్యాలయానికి 15 రోజుల క్రితం డ్యూటీ నిమిత్తం గుంటూరు జిల్లా తాడేపల్లికి వెళ్లారు. డ్యూటీలో అస్వస్థతకు గురవ్వగా.. గురువారం చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 2, 2026
విజయవాడలో నేటి నుంచి బుక్ ఫెస్టివల్

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జనవరి 2 నుంచి 12 వరకు 35వ పుస్తక ప్రదర్శన జరగనుంది. నేడు ప్రముఖుల సమక్షంలో ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనలో 280కి పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. గత 25 ఏళ్లలో కథ, నవల, కవిత, నాటక రంగాల్లో వచ్చిన మార్పులపై ప్రముఖులు చర్చా వేదికల్లో ప్రసంగించనున్నారు. యువ రచయితల పుస్తకాలు ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
News January 2, 2026
రాజ ముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ: కలెక్టర్

రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ కార్యక్రమం జనవరి 9వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారని చెప్పారు. జిల్లాలో మొత్తం 35,690 పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు.