News April 2, 2025

తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక సమావేశం

image

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశానికి వివిధ జిల్లాల నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన వారిని అభినందించిన జగన్, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రజల్లో కొనసాగాలని నేతలకు సూచించారు.

Similar News

News April 8, 2025

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడాదికి రూ.96 కోట్ల భారం

image

వంట గ్యాస్‌ ధరలను సిలిండర్‌కు రూ.50 పెంచుతూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.826గా ఉంది. దీనిపై డెలివరీ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. తాజాగా కేంద్రం పెంచిన ధరతో అసలు ధర రూ. 876కి పెరగనున్నది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 16లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా ఒక్కొ సిలిండర్‌పై నెలకు రూ.50 చొప్పున రూ.8 కోట్లు, ఏడాదికి రూ.96 కోట్ల భారం మోపనున్నారు.

News April 8, 2025

GNT: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వడ్లమూడి నుంచి శుద్ధపల్లికి వెళ్లే దారిలో రేపల్లె-సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉండవచ్చని తెలిపారు. తెలుపు, నీలం రంగు గళ్ల చొక్కా, నీలం రంగు లుంగీ ధరించాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 8, 2025

తాడేపల్లి: మర్డర్ కేసు నిందితుల అరెస్ట్

image

తాడేపల్లి సీతానగరంలో జరిగిన ఇట్టా వర్ధన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొత్తిక భరత్, ఇసుకపల్లి ప్రకాష్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య పూర్వం జరిగిన ఆర్థిక లావాదేవీల విషయంలో ఉద్భవించిన వివాదం వల్ల జరిగిందని గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీ కృష్ణ సోమవారం వివరించారు. కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు.

error: Content is protected !!